Thursday, 16 April 2026 04:31:48 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ముమ్మరంగా సాగుతున్న పెద్దేరు ఆయకట్టు కుడి కాలువ పనులు

మరమ్మతుల తో పెద్దేరు ప్రాజెక్టు కాలువలకు మహర్దశ.

Date : 30 January 2025 08:33 PM Views : 338

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 30 : తంబళ్లపల్లె మండలం జుంజుర పెంట పంచాయతీ పరిధిలోని పెద్దేరు ప్రాజెక్టు కాలువల మరమ్మత్తు పనులతో భవిష్యత్తులో రైతులకు సాగునీరు తోబాటు పశువులకు తాగునీరు అంది మహర్దశ పట్టబోతోంది. గత కొంతకాలంగా పెద్దేరు ప్రాజెక్ట్ కుడి ,ఎడమ కాలువలు ముండ్ల కంపలు, పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా తయారైంది. కూటమి ప్రభుత్వం రాకతో పెద్దేరు ఆయకట్టు చైర్మన్ కొట్టాల శివకుమార్ కోరిక తో తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి చొరవ తీసుకొని ప్రాజెక్టు కాలువల మరమ్మత్తులకు కోటి రూపాయలు మంజూరుకు కృషి చేశారు. గత నెల రోజులుగా ప్రాజెక్ట్ కాలువ పనులు కాంట్రాక్టర్ శ్రీనివాసుల రెడ్డి చైర్మన్ శివకుమార్, కమిటీ సభ్యులు, ఆయకట్టు రైతుల సలహాలు, సూచనలతో మరమ్మతు పనులు నాణ్యతా లోపం లేకుండా శరవేగంగా చేస్తున్నారు. ప్రాజెక్ట్ కుడి కాలువ 17 కిలోమీటర్లు, ఎడమ కాలువ 15 కిలోమీటర్లు లో పూర్తిగా కంపచెట్లు తొలగింపు, కాలువ పక్కన రహదారులు, కాలువలో గండ్లు పటిష్టంగా పూడ్చేపనులు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ కాల్వ మరమ్మత్తు పనులు జరగడం ఇన్చార్జి జయ చంద్రారెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి చలవేనని ప్రాజెక్టులో ఇంకా తాగునీటి బోరు, విద్యుత్తు, పార్కుల మరమ్మతులు, కార్యాలయ మరమ్మతులు, క్వార్టర్స్ మరమ్మతులు,మరుగుదొడ్లు, బోటింగ్ సిస్టం, ఇంకా పలు అభివృద్ధి పనులు పూర్తయితే జిల్లాలో పెద్దేరు ప్రాజెక్టు ప్రముఖ పర్యాటక కేంద్రం తో పాటు వేలాది ఎకరాల కు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాల పెంపుతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :