నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 15 : రామసముద్రం మండలం చెంబుకూరు జడ్పి హై స్కూల్ లో స్కూల్ గేమ్స్ పెడరేషన్ లో భాగంగా 16 తేదీన మంగళవారం మేజర్ పంచాయతీ చెంబకూరు జడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణం లో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తామని ఎం ఈ ఓ 2 ఆంజనేయులు, మండల ఎస్.జి.ఎఫ్.కో ఆర్డినేటర్ దిలీప్ కుమార్, హెచ్.ఎం. రమేష్ బాబు తెలియజేసారు. సోమవారం వీరు మాట్లాడుతూ మండలం లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు అండర్14,17 విభాగాలలో కబడ్డీ, కోకో, వాలీబాల్, షటిల్, బాడ్మింటన్, చెస్,యోగ అథ్లెటిక్స్ నిర్వహిస్తామని అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు, ఉపకార్యదర్శి ఝాన్సీ తెలియజేసారు.ఈ గేమ్స్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి గెలుపొందిన వారిని డివిజన్ స్థాయిలో జరిగే స్కూల్ గేమ్స్ లో అర్హత సాధిస్తారన్నారు. ఈ సమావేశం లో పాల్గొన్నా ఎం ఈ ఓ 2 ఆంజనేయులు పీడీ లు దిలీప్, పార్థ, ఉదయ్, మోహన్, రమాదేవి, మోడల్ స్కూల్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News