నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 16 : తంబళ్లపల్లె మండలం లో పంచాయితీల పరిధిలోని గ్రామాల సుస్థిరాభివృద్ధి కి ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందని సర్పంచ్ లు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఉపేందర్రెడ్డి సూచించారు. శనివారం పంచాయతీల సుస్థిరాభివృద్ధి పై సర్పంచులు, కార్యదర్శులు, అధికారులకు ఒక్కరోజు శిక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులకు ఈ ఓ ఆర్ డి దిలీప్ కుమార్ నాయక్ గ్రామాలలో పేదరిక నిర్మూలన, ఆర్థిక, ఆరోగ్యం, కాలుష్య నివారణ, ఉద్యానవనాల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సామాజిక వనరుల కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో పంచాయతీల అభివృద్ధి లో భాగంగా పారిశుధ్యం, తాగునీరు, వైద్యం,మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన తొమ్మిది అంశాలతో 2025-26 సుస్థిరాభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, ఏపీవో అంజనప్ప, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Reporter
Namitha News