నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : భూముల రీ సర్వేలో రైతులు జాయింట్ పట్టాలపై ఏర్పడిన సమస్యల పరిష్కారానికి ఈనెల 30వ తేదీలోగా భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాలలోని రైతులు వెబ్ ల్యాండ్ 2.0 జాయింట్ పట్టాలను విభజన కు దరఖాస్తు చేసుకోవాలని తంబళ్లపల్లి తాసిల్దార్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో కోరారు. ఈ భూముల విభజన దరఖాస్తు రుసుము రూ 500 ప్రభుత్వం మినహాయించిందని నేడు కేవలం రూ 50 దరఖాస్తు రుసుముతో తమ భూములను విభజన చేసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ భూముల విభజన కార్యక్రమం ద్వారా రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం రాయితీలు పొందే అవకాశం ఉందని రైతులు గమనించాలని సూచించారు.
Reporter
Namitha News