నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 22: అంగళ్లు సమీపం లోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు యన్.సి.సి విభాగము వారు ప్రపంచ జల దినోత్సవం ను ఘనంగా జరుపుకున్నారు. కళాశాల యన్.సి.సి లెఫ్ట్ నెంట్ డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే నేపథ్యంలో మంచినీటి ప్రాముఖ్యతను గుర్తించడానికి ఒక సందర్భం అని అన్నారు. ఈ దినం మనకు నీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుందని, రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడంతో నీటి సంక్షోభం ఏర్పడింది అని అన్నారు. మానవ చరిత్ర మొత్తం జలవనరులతోనే ముడిపడి ఉంది అని, జీవం నీటితో మొదలైంది, ప్రకృతి నీటితోనే నడుస్తోంది, అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి. జీవవైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది అని అన్నారు. ఇవన్నీ తెలిసినా ఈరోజు జరుగుతున్నధీ నీటిని వృధా చేస్తూ కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే, ఉన్న నీటిని వృధాగా నేల పాలు చేస్తున్నాం. నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగడానికి వీల్లేని విధంగా తయారుచేస్తున్నాం అని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరికి వీటి పై అవగహన కల్పించాలని నీటిని కాపాడాలని, ప్రతి నీటి బొట్టూ విలువైందనే విషయాన్నీ తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు వేసిన సేవ్ వాటర్ చిత్రలేఖనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . యన్.సి.సి క్యాడెట్స్ పాల్గొన్నారు.
Admin
Namitha News