నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వాస్థ్య ఆసుపత్రి ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన మదనపల్లె రూరల్ మేజర్ న్యూస్: స్థానిక నక్కలదిన్నె వద్ద ఉన్న స్వాస్థ్య ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మదనపల్లెతో పాటు పరిసర గ్రామాల నుండి దాదాపు 1000 మంది ప్రజలు హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ డా. వెంకటరమణ మాట్లాడుతూ, ప్రజారోగ్యం దృష్ట్యా ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో బెంగళూరులోని ప్రముఖ వైదేహి హాస్పిటల్, బ్రెయిన్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన నిపుణులు గుండె వైద్య విభాగము, దంత వైద్య విభాగము, ఇ.యన్. టి. విభాగము, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరి, స్త్రీ వైద్య విభాగము, ఎముకల విభాగము, చిన్నపిల్లల వైద్య విభాగము, ఫిజియోథెరపి తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారన్నారు.
Reporter
Namitha News