Thursday, 16 April 2026 04:28:19 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

కరువు గడ్డ ఎద్దుల వారి కోటలో మెరిసిన విద్యా కుసుమం మేఘన

ఇంటర్ మొదటి సం ఫలితాల్లో 463/470 మార్కులు

Date : 16 April 2025 07:19 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16: తంబళ్లపల్లె నియోజకవర్గానికి కరువు ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. అయితే ఈ కరువు ప్రాంతంలో సరస్వతీ పుత్రులకు కొదవలేదు. ప్రతి యేటా టెన్త్ తో పాటు ఇంటర్మీడియట్ పరీక్షల్లో బాల బాలికలు తమ ప్రతిభతో ఉత్తమ మార్కులు సాధించడం పరిపాటి. ఈ కోవలో ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో అన్నమయ్య జిల్లా సరిహద్దులోని తంబళ్లపల్లె మండలం ఆర్ఎన్ తాండ పంచాయతీ ఎద్దుల వారి కోట కు చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ లో అసమాన్య ప్రతిభ కనబరిచి ఇంటర్మీడియట్ లో 470/463 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. వివరాల్లోకెళితే ఎద్దుల వారి కోటకు చెందిన ఓ మధ్య తరగతి రైతు బోటి కింద శ్రీనివాసులు, నాగవేణి దంపతుల కుమార్తె మేఘన గత ఏడాది కస్తూరిబా పాఠశాలలో చదివి టెన్త్ లో ప్రథమ స్థానంలో నిలవగా నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సైతం తిరుపతి ఎన్నారై కాలేజీలో ఎంపీసీ గ్రూపులో 463/470మార్కులు సాధించింది. మేఘన నిరుపేద మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టినా చదువులో ఏనాడు అశ్రద్ధ చూపక కస్తూరి పాఠశాలలో సైతం టెన్త్ లో ప్రథమ స్థానంలో నిలిచి తంబళ్లపల్లె మండలానికి ఆదర్శంగా నిలిచింది. అదే ఒరవడి కొనసాగించి ఇంటర్మీడియట్ లో సైతం తన సత్తా చాటి తంబళ్లపల్లె మండలానికి ఆదర్శంగా నిలవడం విశేషం. భవిష్యత్తులో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి నిరుపేదలకు సేవ చేయాలని ఆశిస్తున్నట్లు మేఘన విలేకరులకు తెలిపింది. మా కుమార్తె మేఘన మంచి మార్కులతో పాస్ కావడం సంతోషంగా ఉందని భవిష్యత్తులో సైతం మేఘన చదువు కోసం మా దంపతులం కష్టపడి పని చేస్తామని ధీమాగా చెప్పారు. ఓ మారుమూల ప్రాంతంలో ఓ నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి తన ప్రతిభ తో రాణించడం హర్షణీయమని మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :