Thursday, 16 April 2026 06:17:43 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

విధానంతో వైద్యవిద్య,వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయి - ఫి-4 విదానంపై అపోహలు సృష్టించడం సమంజసం కాదు - ఎమ్మెల్యే జహాని రాజీనామా చేయాలని కోరడం హాస్యాస్పదం -

Date : 06 September 2025 07:04 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పి-4 విధానంతో వైద్యవిద్య,వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయి - ఫి-4 విదానంపై అపోహలు సృష్టించడం సమంజసం కాదు - ఎమ్మెల్యే జహాని రాజీనామా చేయాలని కోరడం హాస్యాస్పదం - టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేష్ విమర్శలు మదనపల్లె : ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే పిపిపి పద్ధతిలో మదనపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జె వెంకటేష్ స్పష్టం చేశారు.శనివారం నిమ్మనపల్లి సర్కిల్ నందు స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి మెడికల్ కళాశాల విషయంలో ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బియస్పి రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కోరడం హాస్యాస్పదమన్నారు.అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలను ఖం దిస్తున్నామన్నారు.గతంలో ఎన్డిఏ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క మెడికల్ కళాశాలని ఏర్పాటు చేయాలనీ ఇందులో కేంద్రం 60 శాతం,రాష్ట్రం 40 శాతం వాటాతో పాలసీ తెస్తే,రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలం చెందడమే కాకుండా,కేంద్రం ఇచ్చిన నిధులతో అరాకొర భవనాలు నిర్మించి,మౌలిక సదుపాయాలు సిబ్బందిని నియామకాలు చేయలేకపోయిందన్నారు.దీంతో కాకినాడలో రెండవ ఏడాది తరగతులు అద్దె భవనాల్లో నిర్వహించే దుస్థితి వచ్చిందని గుర్తు చేశారు.గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలు తెస్తే వాటిలో కేవలం ఐదు కళాశాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు.ఎన్నికల ముందు వైసిపీ అధినేత జగన్ మెడికల్ కళాశాలల పేరుతో డ్రామా ఆడారన్నారు.అదే తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో విజయవంతంగా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకొందన్నారు.జులై 15న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సరైన భవనాలు,వసతి సౌకర్యాలు లేవని నిరకరించిందని పేర్కొన్నారు.తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెటులో వున్నా,పబ్లిక్,ప్రయివేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తుచేశారు.కేంద్రంలో ఎన్డిఏలో రాష్ట్రంలో కుటమి ప్రభుత్వంలో పిపిపి పద్దతిలో మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయడం వలన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.ఇప్పటికే మదనపల్లెలో వంద పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వున్నా మెరుగైన వైద్యం కావాలంటే తిరుపతి,బెంగుళూరు,చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోందని,ఈ పరిస్థితిలో మెడికల్ కళాశాల సేవలు అందుబాటులోకి వస్తే ఇక్కడే వైద్యం పొందే అవకాశం కలుగుతుందని వివరించారు.కూటమి ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసిందని,ప్రజలు మెడికల్ కళాశాలల విషయంలో అపోహలు విడాలని కోరారు.ప్రతిపక్షాలు పోరాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని హితవు పలికారు.కాగా మదనపల్లి వైసీపీ ఇంచార్జి నిస్సార్ అహమ్మద్ 60 శాతం వికలత్వం ఉన్నవారికి పెన్షన్లు తొలగిస్తున్నారని చేసిన ఆరోపణలు అర్థరహితమన్నారు.ఎక్కడైన పెన్షన్లు కోతపెట్టి ఉంటే నిరూపించాలని కోరారు.యూరియా రష్యా,ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా తగ్గిందని,ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని అందించే విధంగా కృషి చేసిందన్నారు.సంక్షేమ పథకాలు అమల్లో చంద్రబాబుతో ఎవరు పోటీ పడలేరన్నారు.టిడిపి రాజంపేట పార్లమెంట్ మహిళా కార్యదర్శి విజయమ్మ,నాగమణి,ప్రమీలలు మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం,నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేని రాజీనామా చేయాలని కోరడంలో అర్ధం లేదన్నారు.ప్రజలు ఓట్లు వేస్తే షాజహాన్ బాషా ఎమ్మెల్యే అయ్యారని,ఇప్పటికైనా బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాజంపేట పార్లమెంట్ మహిళా కార్యదర్శి విజయమ్మ,రాచవేటివారిపల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున,ఉషారాణి,నాగమణి,ప్రమీలమ్మ, రాటకొండ భారతి,భువనేశ్వర్ రెడ్డి,గండికోట గణేష్ బాబు,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :