నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 15 : తంబళ్లపల్లె జే సి జే కోర్టులో శనివారం నిర్వహించబోయే లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని మండల న్యాయ సేవ సంఘం అధ్యక్షులు ఇంచార్జ్ న్యాయమూర్తి ఐ. ప్రవీణ్ కుమార్ సూచించారు. శుక్రవారం స్థానిక జేసిజే కోర్టులో న్యాయమూర్తి ఆధ్వర్యంలో తంబళ్లపల్లె, పెద్దమండెం, మొలకలచెరువు, పెద్ద తిప్ప సముద్రం మండలాల పోలీసు మరియు సెబ్ సిబ్బంది, న్యాయవాదుల తో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు జరిగే ఉపయోగాలను వారికి ఉపదేశించి ఈ లోక్ అదాలత్ ద్వారా సులువుగా కేసులు పరిష్కారం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలా చైతన్యపరచాలని కోరారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News