నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - అక్టోబర్ 20 : అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలం, తూముకుంట పంచాయతీ, నాయనివారిపల్లెకి సమబంధించిన కోర్రు రామప్పనాయుడు,అనే గొర్ల కాపరికి సంబంధించిన 15 పొట్టేండ్లు ఆదివారం సాయంత్రం 4:40 గంటలకు పిడుగుపడి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీంతో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గొర్ల యజమాని రామప్పనాయుడుని పరామర్శించి మృతి చెందిన గొర్లకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులతో మంత్రివర్యులు మాట్లాడి ప్రభుత్వం తరపున పొట్టేళ్లకు అందాల్సిన ఆర్థిక సహాయం ఏమైన ఉంటే వెంటనే మంజూరు చేయించాలని వారిని ఆదేశించడం జరిగింది.
Reporter
Namitha News