నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్: మార్చి 31:-రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు కు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వార్డు ప్రజలు పూల దండలు,బాణ సంచాలతో ఘనస్వాగతం పలికారు.అనంతరం వార్డులో తర్వాత గడపగడపకు తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాయచోటి అసెంబ్లీ స్థానాన్ని రాజంపేట పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా,గవర్నర్ కళ్యాణమండపం జాఫర్ అలీ, మాజీ కౌన్సిలర్ ఖాదర్, సలీం, ఇలయాజ్, జిలన్,షాకీర్, అతావుల్లా, అమానుల్లా జువెలరీస్ ఖాదర్బాషా,జయరాం, రెడ్డి,శివారెడ్డి, కొండారెడ్డి, ఇనతుల్ల,సల్లు మైనారిటీ నాయకులు,సోదరులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
Namitha News