నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 13 ః తంబళ్లపల్లె మండలం లో రాష్ట్ర కమిషనర్ మరియు పిడి ఆదేశాల మేరకు ఉపాధి హామీలో శనివారం లోపు 157 వ్యక్తిగత సోక్ పిట్ లు నిర్మించి గిన్నిస్ రికార్డుకు సహకరించాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. గురువారం వారితో మాట్లాడుతూ ఇంటి ఆవరణంలో నీటి నిలువ కోసం వ్యక్తిగత సోక్పిట్లు నిర్మించుకుంటే రూ 6000 చెల్లించడం జరుగుతుందని ఉపాధి హామీ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన సోక్ పిట్ల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా పరిసరాలలోని నీటి నిలువ కోసం కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణం జరిగితే రూ50,000 చెల్లించడం జరుగుతుందని వీటిపై దృష్టి పెట్టి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఏపీవో అంజనప్ప, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, టీఏలు శంకర, శేఖరమ్మ, వెంకటరమణ, నాగార్జున తదితరులున్నారు.
Reporter
Namitha News