నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జులై 16 : అన్నమయ్య జిల్లా సమగ్రాబివృధ్దే ప్రధాన అజెండాగా జరుగుతున్న ప్రజాపోరాటాల సారథి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ, జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు టి. కృష్ణప్ప నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి లు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక పిటిఎం రోడ్డు నందు మహాసభలకు సంబంధించిన కరపత్రాల విడుదల కార్యక్రమం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ; ప్రతి మూడు సంవత్సరములకు పార్టీ గ్రామీణ స్థాయి నుండి మొదలుకొని మండల,పట్టణ,నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర,జాతీయ మహాసభలు జరుపుకోవడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా ఆగస్టు మూడవ తేదీ ఆదివారం బీ.కొత్తకోట పట్టణంలో నియోజకవర్గపు మహాసభ,అలాగే 10,11 తేదీలలో మదనపల్లి పట్టణంలో జిల్లా రెండవ మహాసభ,20 నుండి 24 తేదీల వరకు ఒంగోలు పట్టణంలో రాష్ట్ర మహాసభలు,సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీఘర్ లో జాతీయ మహాసభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు.ఈ యొక్క మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనా, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల పైనా చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం జరుగుతుందన్నారు.పార్టీ ఆవిర్భవించి నూరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా జరుగుతున్న ఈ యొక్క మహాసభలు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నవని,ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించి జయప్రదం చేయుటకు పూనుకోవాలని,కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కొరకు పోరాటాలకు శ్రీకారం చుట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు యస్.బషీర్ ఖాన్,జి. రఘునాథ్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్ అల్లీ, ఎం.గంగులప్ప, రామచంద్ర, హబీబ్,మోదిన్, బావాజాన్, షాకీర్, మస్తాన్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News