నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జులై23: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని ఆర్. నడింపల్లి గ్రామ పంచాయతీ హరిజనవాడ లో బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీయస్ అధినేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఎంఆర్పీయస్ అధ్యక్షులు భాస్కర్, సీనియర్ నాయకులు హరి, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఎంఆర్పీయస్ నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ కోటా డేనియల్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోటా డేనియల్ మాదిగ మాట్లాడుతూ మందక్రిష్ణ మాదిగ 30సంవత్సరాల ఎంఆర్పీయస్ ఉద్యమ పోరాటాలలో మాదిగల ఆత్మ గౌరవం, హక్కులు, ఎస్సీ వర్గీకరణ ఫలితాలు, కాకుండా ఆరోగ్యశ్రీ పథకం, వృద్దులకు, వితంతువులకు, వికలాంగుల పెన్షన్ 4000,6000,15000 రూపాయలు పెంపుదలకు కారకులై, దేశంలోనే అన్నివర్గాల వారికి సమన్యాయం చేసిన మహోన్నత వ్యక్తి పద్మ శ్రీ మందక్రిష్ణ మాదిగ అన్నారు. అలాగే ఎంఆర్పీయస్ జెండా ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వై. రవీంద్ర మాదిగ, ఎంయస్పి నియోజకవర్గ నాయకులు ఆరేటి వాసు, కో ఇంచార్జ్ మోపూరి మనోహర్, ఎంఆర్పీయస్ సీనియర్ నాయకులు జి. రాజేష్, ఎంయస్పి సీనియర్ నాయకులు కొండప్ప, మండల అధ్యక్షులు గంగాధర్,ఎంఆర్పియస్ ప్రచార కార్యదర్శి జి.వాసు, ఎంయస్పి మండల అధ్యక్షులు జి. సుధాకర్, విహెచ్పియస్ మండల అధ్యక్షులు విశ్వనాధ్, ఎంయస్ యఫ్ నియోజకవర్గ నాయకులు సుబ్బు, హరి, ఎంయస్ యఫ్ మండల అధ్యక్షులు భాస్కర్, ఎంఆర్పీయస్ సీనియర్ నాయకులు మమ్మీ, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు అశోక్, కార్యదర్శి రవి,ఖాన్,పతి,బన్నీ, గ్రామ పెద్దలు బాయప్ప, రమేష్, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News