నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్26 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని ప్రజలు మొంథా తుఫాను నేపథ్యంలో రానున్న 27,28,29 తేదీలలో భారీ నుండీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై రమేష్ బాబు ఆదివారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. విద్యుత్ స్తంభాలు వైర్లు, చెట్ల దగ్గర నిలబడకుండా ఉండుట బలహీనంగా ఉన్న షెడ్లను తొలగించుట లేదా మరమ్మత్తులు చేపట్టటం, పాత ఫ్లెక్సీలను తొలగించడం ఇళ్ల పరిసరాలలో ప్రమాదంగా వంగి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం గాలి వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో ఇంటి బయటకు వెళ్లకుండా ఉండటం ఇంట్లో అవసరమైన ఆహార వస్తువులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే మాకు తెలియజేయాలని లేదా విపత్తు నిర్వహణ అధికారులకు తెలియజేయాలని సూచించారు
Admin
Namitha News