నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ తెలిపారు.ఆదివారం ఆయన గుండ్లపల్లి చెండ్రాయుని చెరువును పరిశీలించారు. చెరువు తూము మరమ్మతులు, కాలువలు నిర్మాణాలపై ఆయకట్టు చైర్మన్ జి వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ పెద్దప్పల్ల,మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ నాయుడు,జనసేన నాయకుడు జి సిద్దమల్ రెడ్డిలు సాయినాథ్ కు తెలుపగా ఆయన వెంటనే స్పందించి చెరువు అభివృద్ధి నిధుల మంజూరు కోసం జిల్లా స్థాయి అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, బిసి నాయకుడు పెద్ద వీరభద్ర,ఈ. రెడ్డప్ప నాయుడు, ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, పెద్దరెడ్డెప్ప, సురేంద్రరెడ్డి, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News