నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 7 : దేశంలోని పలు రాష్ట్రాలలో హెచ్ఎం పివి వైరస్ కేసులు నమోదైన దృశ్య స్థానిక ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని తంబళ్లపల్లె మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజస్వి, డాక్టర్ రీచర్డ్ లు తెలిపారు. మంగళవారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఎం పివి వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ తరహాలోనే ఈ హెచ్ఎంపివీ వైరస్ లక్షణాలు ఉంటాయని దగ్గు, జలుబు, జ్వరం, నీరసం వస్తాయని చెప్పారు. మనిషిలో వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్న వారిని ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని ముందస్తుగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, గుంపులు గుంపులుగా ఉన్నచోట జాగ్రత్తగా వ్యవహరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, శానిటైజర్ కచ్చితంగా వాడాలని వ్యాధి లక్షణాలున్న వారు వెంటనే ఆసుపత్రిని సందర్శించి తగు వైద్య చికిత్సలు పొందాలని సూచించారు. ఈ విషయమై ఆసుపత్రిలో రోగులకు మార్క్ డ్రిల్ నిర్వహించి పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ గ్లోరీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News