నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 28: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరం ఆగస్టు 28తేదీన హైదరాబాదు లోని బషీర్ బాగ్ సెంటర్లో,వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్తు చార్జీల వ్యతిరేక ఉద్యమంలో, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరిపించిన పోలీసుల కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గం కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు ప్రజానీకానికి పిలుపునిచ్చారు.2024 సంవత్సరం ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని,పెరిగిన వాటిని తగ్గిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ట్రూఆఫ్ చార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై మోపడం,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన స్మార్ట్ మీటర్లను అధికారంలోకి రాగానే బలవంతంగా బిగించడం వంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ,25 సంవత్సరముల తర్వాత రాష్ట్రంలోని తొమ్మిది వామపక్ష పార్టీలు ఆగస్టు 28న ప్రతిజ్ఞ దినం పాటించాలని ఇచ్చిన పిలుపుమేరకు,సిపిఐ బీ. కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11:30 గంటలకు స్థానిక జ్యోతి చౌక్ నందు గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.బషీర్ బాగ్ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ,విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల ఫోటోలను ప్రదర్శిస్తూ,పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, అదానితో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ ఉద్యమ అమరవీరులారా! ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో,ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన మీకు మా విప్లవ జోహార్లు అంటూ, మీ త్యాగాలను వృధా కానిఇవ్వబోమని,మీరు చూపిన సమరశీల బాటలో,రాష్ట్రంలోని కాళకూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ-అ దాని అనుకూల విద్యుత్ సంస్కరణలు,పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు,స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అలీ,ఎస్.తంబయ్య శెట్టి,హెచ్.షమీవుల్లా, జి.నారాయణస్వామి,ఎం. గంగులప్ప,దుమ్ము.బాబు, పి.మంజునాథ్,గంగాధర్, రెడ్డప్ప,రియాజ్,సోమశేఖర్,రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News