Thursday, 16 April 2026 08:03:15 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

బుక్కకాలవ శ్రీ బోయకొండ గంగమ్మ జాతరలో పాల్గొన్న నిస్సార్ అహ్మద్

Date : 22 April 2025 03:55 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అడిగిన వరాలు ఇచ్చే కల్పవల్లిగా ప్రసిద్ధి కెక్కిన బుగ్గకాలువ బోయకొండ గంగమ్మ జాతర తొలి పూజలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. బుగ్గకాలువ బోయకొండ గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం నిర్వహించిన పూజా కార్యక్రమానికి మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు నిస్సార్ అహమ్మద్ కు పూలమాలలు వేసి దుశ్శాలువతో సన్మానించారు. అమ్మవారికి ‌ఉదయం‌ అభిషేకాల, పూజాది కార్యక్రమాలు నిర్వహించగా నిస్సార్ అహమ్మద్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. పూజ కార్యక్రమాల అనంతరం నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కోరిన భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా బుగ్గకాలువ గంగమ్మ ప్రసిద్ధి కెక్కిందన్నారు. నిత్యం భక్తుల పూజలు అందుకునే గంగమ్మకు ప్రతి సంవత్సరం వైభవంగా జారత నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. మదనపల్లె పట్టణ ప్రజానీకం గంగమ్మకు నిత్యం పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారని, మదనపల్లె ప్రజలు ఏదైనా శుభకార్యాలు తలపెట్టిన సమయంలో గంగమ్మను‌ దర్శించుకుని వెళ్తే ఆ పని కోరిన విధంగా జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం అన్నారు. ‌ అనారోగ్యంతో బాధపడుతున్న వారు, భూత ప్రేత భయంతో బాధపడే వారు ఇక్కడ పూజలు చేస్తే అన్ని బాధలు తగ్గి సంతోషంగా వుంటారనే నమ్మకం ఈ ప్రాంత ప్రజలలో వుందని వెల్లడించారు. జాతర సందర్భంగా మదనపల్లె చూట్టూ పక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. నిస్సార్ అహమ్మద్ తోపాటు అన్నమయ్య జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ కరీముల్లా, హరి, లక్ష్మీదేవి, యూనస్, పవన్ తేజ, రవితేజ, వేణుగోపాల్ రెడ్డి, మహేష్, మల్లికార్జున రెడ్డి, శారద, నాగమణి నర్సింహులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :