నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 4 ః తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మూడు మాసాల ఆలయ హుండీ ద్వారా రూ 6,64,916 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశి కుమార్, ఈవో మునిరాజా లు విలేకరులకు తెలిపారు. మంగళవారం మండల టిడిపి అధ్యక్షుడు వి ఉత్తమ రెడ్డి ఆధ్వర్యంలో మల్లయ్య కొండ మహా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ హుండీ ఆదాయాన్ని తాత్కాలిక కార్య నిర్వాహక కమిటీ సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్వదినం సందర్భంగా మహా శివుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై కొండపై ఉత్సవానికి హాజరయ్యే భక్తజనకోటికి సౌకర్యాలు ఏర్పాటులో అన్ని శాఖల అధికారుల సహకారంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు బేరి శ్రీనివాసులు, సుధాకర్ రెడ్డి, చెరువు సంఘం అధ్యక్షులు రామలింగారెడ్డి, సామిరెడ్డి, కుమార్ నాయుడు, శ్రీనివాసులు, శివన్న, కోసువారి పల్లి కేశవరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మణి, మ్యూజికల్ శివ, రాజంపేట పార్లమెంట్ బిసి నాయకుడు సోమశేఖర్, టిడిపి నాయకులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
Reporter
Namitha News