నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 20 మందితో అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవ కమిటీ... ఆలయ ఈవో రమణ సమక్షంలో ఏర్పాటు.. మదనపల్లి పట్టణం, శివనగర్ లో వెలిసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలపాటు జరిగే ఉత్సవాలను విజయవంతం చేసేందుకు 20 మ 0దితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. గురువారం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఉత్సవ కమిటీ ద్వారా రెండు నెలల పాటు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, పడిపూజ, గ్రామోత్సవం, జ్యోతి దర్శనం పెద్ద ఎత్తున విజయవంతం ఉత్సవ కమిటీ కృషి చేయనున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనలు వరకు ఈ ఉత్సవ కమిటీని ఆలయ ఈవో రమణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఇందులో మార్పురి సుధాకర్ నాయుడు, రాజభవన్ రాజా,శివమూర్తి, భాస్కర్ నాయుడు, రమణ రావు, హేమంత్, బాలకృష్ణ,మల్లె నాయక్, నాగభూషణ్ రెడ్డి,జర్మనీ రాజు, డంకనచారి సోమశేఖర్, మహేష్ , తదితరులు ఉన్నారు.
Reporter
Namitha News