నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 3 : తంబళ్లపల్లె మండలం లో 100% అక్షరాస్యత సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు, మహిళా సంఘాలు, సచివాలయ సిబ్బంది కి అక్షరాస్యత సాధన పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సంబంధిత శాఖల ప్రతినిధులు తమ పరిధిలోని నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, ఏటీఎం గంగాధర్, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, సూపర్వైజర్లు రాధ, అంగన్వాడీలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.
Reporter
Namitha News