నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తురకపల్లి ఖాసీం, మదనపల్లె మున్సిపాలిటీ మోతీనగర్ కు చెందిన మహమ్మద్ అలి లను పరామర్శించిన మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్... మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం బోడుమల్లయ్యగారిపల్లికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తురకపల్లి ఖాసీం తండ్రి అబ్దుల్ రజాక్ మృతి చెందారు. అబ్దుల్ రజాక్ పార్థివ దేహన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిస్సార్ అహమ్మద్ తోపాటు ఖాదర్ బాషా, మల్లికార్జున, రెడ్డి భాస్కర్, బాషా సాహెబ్, అబ్దుల్, యాసిన్, సాదిక్, నూర్ మహమ్మద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లె మున్సిపాలిటీ మోతీనగర్ కు చెందిన మహమ్మద్ ఆలి తండ్రి అబ్దుల్ జబ్బార్ అనారోగ్యంతో మృతి చెందారు. అబ్దుల్ జబ్బార్ పార్దివ దేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్ఘ్యం చెప్పారు. నిస్సార్ అహమ్మద్ తోపాటు గుండ్లూరి రఫి, ఇమ్రాన్, ఖాదిర్, షపీ, సద్దాం, సాదిక్, యాసిన్, అబ్దుల్, జబివుల్లా ఖాజ్రీ హాజరైనారు.
Reporter
Namitha News