నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : నాటు సారా అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పెద్దమండెం పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి ఎస్సై వెంకటేష్ కథనం మేరకు.. మండలంలోని వెలిగల్లు పంచాయతీ, తురకపల్లికి చెందిన రమేష్ (26) ఆదివారం సాయంత్రం నాటు సారా అక్రమంగా వాటర్ కాన్ లో తీసుకుని వస్తుండగా తనిఖీలలో నిందితుడు పట్టుబడినట్లు తెలిపారు. పట్టుబడిన సారా స్వాధీనం చేసుకొని, నిందితుని స్టేషన్కు తరలించి విచారణ అనంతరం కేసునమోదు చేసి అరెస్టుచేసామని తెలిపారు
Reporter
Namitha News