Thursday, 16 April 2026 07:59:54 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

బిజెపిని సంస్థాగతంగా బలోపేతం చేద్దాo- రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్...

బిజెపి జిల్లా కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాజంపేట పార్లమెంట్ బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యక్షతన జిల్లాస్థాయి కార్యశాల జరిగింది

Date : 03 December 2024 06:11 PM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బిజెపిని సంస్థాగతంగా బలోపేతం చేద్దాo- రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్... మదనపల్లి: డిసెంబర్ 03 (నమిత న్యూస్ మణి విలేఖరి) పట్టణంలోని బిజెపి జిల్లా కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాజంపేట పార్లమెంట్ బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యక్షతన జిల్లాస్థాయి కార్యశాల జరిగింది.ఈ సమావేశంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్లు కో-కన్వీనర్లు మండల బిజెపి అధ్యక్షులు మండలాలకు చెందిన సభ్యత్వ ప్రముఖులు రాష్ట్రస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈరోజు కార్యశాల నిర్వహించడం జరిగిందని, జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ ఆఫ్లైన్ సభ్యత్వ నమోదులో ఇంచుమించు లక్ష సభ్యత్వాలు జిల్లా లో నమోదు కావడం, జిల్లాలోని భారతీయ జనతా పార్టీ శ్రేణుల సమిష్టి కృషి వల్లనే సాధ్యమైందని ,అందులోనూ ,ఆన్లైన్ సభ్యత్వాలు ఆఫ్లైన్ సభ్యత్వాలు అత్యంత పారదర్శకంగా జరగడం రాష్ట్ర పార్టీ ప్రశంసలు అందుకోవడం జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూగర్వపడాల్సిన అంశమని ఆయన అన్నారు సంస్థాగత నిర్మాణ ప్రక్రియ త్వరలోనే చివరి దశకు చేరుకోనున్నదని బూత్ కమిటీలు శక్తి కేంద్రాల ఏర్పాటు మండల కమిటీల ఏర్పాటు ఈ నెలాఖరులోగా పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు జిల్లాలోని అభివృద్ధి వివిధ రకాల సమస్యల పరిష్కారం పార్టీ సంస్థాగత విస్తరణ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడం జాతీయస్థాయిలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంసాధించిన విజయాలను వివరిస్తూ రాష్ట్రస్థాయిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా వివరిస్తూ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈ సందర్భంగా సమావేశంలో సంస్థాగత విషయాలపై జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సమీక్ష నిర్వహించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్,జిల్లా సంస్థాగత ఎన్నికల సహాయ అధికారి పులి నరేంద్ర కుమారరెడ్డి,గోరంట్ల రమేష్,జిల్లా సాధారణ సభ్యత్వం ప్రముఖ గోపాల్ రెడ్డి ,జిల్లా క్రియాశీలక సభ్యత ప్రముఖ ఆకుల కృష్ణమూర్తి, జిల్లా శ్రీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :