Thursday, 16 April 2026 07:57:26 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ముంబై దుర్గా ఇంటికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్

అన్నమయ్య జిల్లా లో బెస్తల అభివృద్ధి కి సహకారం అందించాలి

Date : 10 September 2025 03:44 PM Views : 400

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముంబై దుర్గా ఇంటికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ - అన్నమయ్య జిల్లా లో బెస్తల అభివృద్ధి కి సహకారం అందించాలి ప్రతి సొసైటీకి పని ముట్ల ఇచ్చి బెస్తలను ఆదు కోవాలని విజ్ఞప్తి బెస్త సాధికార కమిటీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ముంబై దుర్గా - ఘనంగా రాష్ట్ర బెస్త కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ కు ఆహ్వానం మదనపల్లి సెప్టెంబర్ 10,(మణి నమిత న్యూస్ విలేఖరి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ బుధవారం మదనపల్లి పట్టణంలో దేవత నగర్ లో బెస్త సాధికార కమిటీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ముంబై దుర్గా ఇంటికి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన కు బొమ్మన శ్రీధర్ బాబు కు రాజంపేట పార్లమెంట్ బెస్త సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు ముంబై దుర్గా ఆధ్వర్యంలో బెస్త కులస్తులతో కలసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన తేనేటి విందులో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర లో బెస్త కులస్తులకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రతి సొసైటీకి పనిముట్లు అందించి బెస్త కులస్తులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా లో బెస్తల సమగ్ర అభివృద్ధి కీ సహాయ సహకారాలు అందించడం తో పాటు అర్హలైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు అందేలా చూడాలని ముంబై దూర్గా కోరారు. జిల్లా లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బెస్త సామాజిక వర్గాన్ని కలుపు కుని ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం తో పాటు, ప్రతి పక్షాల ఆరోపణ లను తిప్పి కొట్టడం జరుగు తోందని పేర్కొన్నారు. జిల్లా లో నెలకొన్న వర్షా బావ పరిస్థితుల దృశ్యా ప్రభుత్వం, కార్పొరేషన్ ద్వారా అదుకోవాలని కోరారు. అనంతరం కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొమ్మన శ్రీధర్ కు దుశ్యాలువ కప్పి, పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మా నించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పొన్న దుర్గ, మురళి, లాయర్ రమణ మూర్తి, మల్లికార్జున,మల్లెల రమేష్, ప్రసాద్, మురళి, చలపతి లు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :