నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 23 : తంబళ్లపల్లె మండలం లోని రైతులు ప్రభుత్వ పథకాలు, రాయితీలకు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని ఏ ఈ ఓ లు సురేష్, అంబేద్కర్ లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని సచివాలయాలలో రైతులకు ఈ కేవైసీ, పంటల నమోదు పై అవగాహన సదస్సు తోపాటు వ్యవసాయ సస్యరక్షణ పై సూచనలు చేశారు. రైతులు ఆరు తడిపంటలు, పండ్ల తోటల పెంపకం పై దృష్టి సారించి అదే విధంగా క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వ్యవసాయంపై అవగాహన పెంచుకొని వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలలో సంబంధిత సచివాలయాల పరిధిలోని రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News