నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్కిల్ డెవలప్మెంట్ వారిఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలోని టీవీ టెక్నీషియన్స్ కి స్కిల్స్ అప్గ్రేడషన్ శిక్షణ శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలి శ్రీ. సూరి బాబు గారు, జిల్లా పరిశ్రమల అధికారి, అన్నమయ్య జిల్లా. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల లో అన్నమయ్య జిల్లాలోని టీవీ టెక్నిషన్స్ కి రెండు రోజుల పాటు అప్ స్కిల్ల్లింగ్ ప్రోగ్రాము( RPL ) ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇండస్ట్రీస్ ఆఫీసర్ శ్రీ సూరి బాబు గారు, మరియు టీవీటెక్నిషన్స్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ. మధుసూదన్ రెడ్డి గారు, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ లాలూ గారు , అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీ. హరి కృష్ణ గారు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇండస్ట్రీస్ ఆఫీసర్ శ్రీ. సూరి బాబు గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలోని టీవీ టెక్నిషన్స్ కి రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (RPL) పథకం కింద ఒక మార్గదర్శక కార్యక్రమం ప్రారంభించబడిందని, ఈ కార్యక్రమం టీవీ సాంకేతిక నిపుణులకు కొత్త సాంకేతికతలలో అత్యాధునిక శిక్షణను అందించడంపై దృష్టి చేయటం జరుగుతుందని తెలియజేశారు. అలాగే కొత్తగా రూపు దిద్దుకున్న టెక్నాలజీ కి అనుగుణంగా మీరు కూడా కొత్త టెక్నాలజీ పై ద్రుష్టి పెట్టాలని తెలియజేశారు. అలాగే ఎవరైనా అర్హత నిరుద్యోగ యువతీ యువకులు వారు తమ స్వంత కాళ్లపై నిలబడాలనే వారు జిల్లా ఇండస్ట్రీస్ కార్యాలయాన్ని సంప్రదించగలరని తెలియజేశారు. అనంతరం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని 120 మంది టీవీ టెక్నిషన్స్ కి రెండు రోజుల పాటు ప్రస్తుత టెక్నాలజీ, అత్యాధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని , రెండు రోజుల శిక్షణ అనంతరం వారికి ఢిల్లీ లోని ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా అస్సేస్మెంట్ కండక్ట్ చేసి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు, షిరిడి సాయి ఎడ్యుకేషన్ సొసైటీ శ్రీ మనోహర్ రెడ్డి గారు, టీవీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ. హరి కిషోర్ గారు, ఉస్మాన్ బాషా, ఫజులు రహమాన్ గారు, ఇతర అథికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News