నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సత్యం,అహింస, సమానత్వం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం ఎప్పటికీ శాశ్వతం అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ జయంతిని వైసిపి కార్యాలయంలో 156 వ జయంతి ఘనంగా నిర్వహించారు. జాతిపితకు జయంతి సందర్భంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గం ఆదర్శనీయం, అనుసరనీయం అని వివరించారు. ఆయన ఎంచుకున్న మార్గంలో పయనించి దేశంలో పెచ్చురిల్లిన అవినీతి, అంతర్గత విభేదాలు, కుల, మత తత్వాలను అంత మోందించాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. భరత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ, ఆ మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలని, అప్పుడే మనం కలలు కంటున్న నవ భారత దేశం సాకారం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనుజా రెడ్డి, వైసిపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షమీమ్ అస్లాం, కొత్తపల్లి మహేష్, చరణ్, చిన్న, ఇర్ఫాన్, మల్లికార్జున, అమ్మజాన్, నాగమణి, వినుతా భాయ్, శారద రెడ్డి, ఈశ్వర్ నాయక్, గ్రానైట్ మహేష్, యూనిస్, నూర్ మోదిన్, అబ్దుల్, ఎం.నవాజ్, యాసిన్, షాన్‌వాజ్, తాజ్ బాషా పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News