Thursday, 16 April 2026 07:55:46 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారే గురువు -- గురు పౌర్ణమి సందర్భంగా నిస్సార్ అహమ్మద్‌

Date : 10 July 2025 07:35 PM Views : 265

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారే గురువు -- గురు పౌర్ణమి సందర్భంగా నిస్సార్ అహమ్మద్‌ వెల్లడి -- అమచెరువుమిట్ట శేషాచల నగర్ షిర్డీ సాయిబాబా ఆలయంలో నిస్సార్ అహమ్మద్‌ ప్రత్యేక పూజలు మానవ జీవిత చరితార్థానికి, భగవదర్శనానికి బాటలు వేసే వారే గురువులు, గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తామని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ పేర్కొన్నారు. గురుపూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, వ్యాసపూర్ణిమ, ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఈ రోజు ఎంతో పవిత్రమైనదని గురు‌ పౌర్ణమి సందర్భంగా మదనపల్లె శేషాచల నగర్ షిర్డీ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో నిస్సార్ అహమ్మద్‌ పాల్గొన్నారు. ‌ఈ సందర్భంగా స్దానిక నాయకులు ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ‌దర్శన ఎర్పాట్లు తోపాటు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.‌ ఈ సందర్భంగా గురువు విశిష్టతను నిస్సార్ అహమ్మద్‌ వివరించారు. గురువులకు గురువుగా ఖ్యాతి గడించిన మహనీయుడు వ్యాసమహర్షి అని, ఆషాఢ పూర్ణిమను గురు పూజతో ఉత్సవం చేయటం భారతీయ సంస్కృతిలో భాగమైందని వెల్లడించారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారే గురువు, మనం జన్మించిన తరువాత మన కన్న తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా, మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశనం చేసేవారే గురువు అని, సమస్త ప్రకృతిలో నిండి జానాన్ని, ప్రేమను పంచటానికి గురువులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, ఆ మహత్తర ఙ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం అన్నారు.‌ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శివారెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, బయ రెడ్డి, మధు , కృష్ణారెడ్డి, విశ్వనాథరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు, ఆనంద, వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, యూనస్, అబ్దుల్లా, జబివుల్లా, సాదిక్ పాల్గొన్నారు..

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :