నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 15 : తంబళ్లపల్లె మండలంలో గత మూడు రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసి మండల కేంద్రంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఆ కూలిన భారీ వృక్షాలు తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డుకు అడ్డంగా వృక్షాలు తొలగించకపోవడంతో నిత్యం వందలాది వాహనాల తో పాటు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బిసి హాస్టల్ లోని ఓ వృక్షం కూలీగా పక్కనే గల చింత చెట్టు విద్యుత్ తీగలకు అడ్డంగా ఉందని విద్యుత్ అధికారులు కొమ్మలు నరికేసి అలాగే వదిలేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే స్పందించి కూలిన వృక్షాలను తొలగించి వాహన చోదకులకు అసౌకర్యం లేకుండా చూడాల్సి ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Admin
Namitha News