నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె(మొలకలచెరువు ) - మే 24 : తంబళ్లపల్లె నియోజకవర్గం దశాబ్దాలుగా అన్ని రంగాలలో వెనుకబడిందని తంబళ్లపల్లె అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా జీవిత లక్ష్యమని తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి హర్ష ద్వానాల మధ్య ప్రకటించారు. శనివారం మొలకలచెరువు కేజీఎన్ ఫంక్షన్ హాల్ లో మినీ మహానాడు వేలాదిమంది కార్యకర్తలతో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత పార్టీ జెండా ఆవిష్కరణ గావించి అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి తంబళ్లపల్లె నియోజకవర్గం లో మృతి చెందిన టిడిపి కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడని ప్రతి సమస్యను పరిష్కరించడానికి కూటమి నాయకుల సమన్వయంతో నా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లె రైతాంగానికి హంద్రీనీవా సాగునీరు అందించి తద్వారా వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని పెద్దేరు ఆయకట్టు అభివృద్ధి, ముదివేడు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు పరిహారం చెల్లింపు,చెరువుల మరమ్మత్తు! లతో ప్రతి ఎకరం సాగయి హార్టికల్చర్, వ్యాపార పంటలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నిరుద్యోగులకు ఉపాధి కోసం పారిశ్రామిక వాడలు, డ్వాక్రా మహిళలకు మైక్రో మధ్యతరగతి, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు, యువతకు చదువుతోపాటు ఉపాధి అవకాశాలు కల్పన, బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పేదకు పక్కా ఇల్లు నిర్మాణం, పర్యాటక కేంద్రాలైన హార్స్లీ హిల్స్, తంబళ్లపల్లె మల్లయ్య కొండ, చెన్నకేశవ స్వామి ఆలయం, తెట్టు ఆలయం,పెద్దేరు ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు పర్యాటక రంగాన్ని విస్తృతం చేస్తామన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి కార్యకర్త నా వెంట ఉండి నడిపిస్తున్నారని వారే నాకు కొండంత అండగా నిలబడ్డారని వారే నా బలం, బలహీనత వారికోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్లు హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం తంబళ్లపల్లె నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల చిత్రపటాన్ని జయచంద్రారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గిరిధర్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ మెంబర్ పర్వీన్ తాజ్, సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు, అబ్జర్వర్ గురువారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, కురబలకోట మండల పార్టీ అధ్యక్షుడు వై జి సురేంద్ర,బి కొత్తకోట లోకనాథ్ రెడ్డి, తంబళ్లపల్లె మండల కన్వీనర్ రెడ్డప్ప రెడ్డి, సిద్ధమ్మ, బేరి శ్రీనివాసులు, బిఎంఆర్, తరుగు శివారెడ్డి,పురుషోత్తం, వీరాంజనేయులు, ఆదిరెడ్డి, జగదీష్, సోమశేఖర్, ఆనంద్, లక్ష్మీనారాయణ నాయుడు, కృష్ణమూర్తి నాయుడు, నరసింహులు, సుధాకర్ రెడ్డి, కాలా నారాయణ, పెద్ద వీరభద్ర, అల్లావుద్దీన్ , సుధాకర్,నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News