నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి జనవరి 28: మంగళవారం రాయచోటి కలెక్టరేట్ నందలి తన చాంబర్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం 2025 నూతన సంవత్సరం డైరీని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లాలోని వ్యవసాయ అధికారులు రైతులకు నిరంతర సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్, వ్యవసాయ అధికారులు సంఘం అధ్యక్షులు నవీన్ కుమార్, కార్యదర్శి రమేష్ బాబు రావు, కోశాధికారి వేంకట మోహన్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు నాగమణి, గీత, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News