నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అన్నమయ్య జిల్లా కురబలకోట కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బైకు తంబళ్లపల్లె మండలానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఘోరం జరిగింది. మదనపల్లి నుంచి తంబళ్లపల్లె కు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వెళ్లి బైకుతో బస్సును ఢీ కొట్టడంతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు దుర్మరణం చెందినట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మృతులు తంబళ్లపల్లి మండలం, మొలక వారి పల్లి పంచాయతీ చెట్లవారిపల్లి కు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి(19), అజయ్ కుమార్ రెడ్డి(19) లుగా గుర్తించి మృతదేహాలకు పంచనామ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనికి మార్చురీకి తరలించి కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.
Reporter
Namitha News