నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - నవంబర్ 06 : మొలకలచెర్వు టౌన్ గ్యాస్ ఆఫీస్ సమీపంలో ఉన్న మైదానంలో తంబల్లపల్లె నియోజకవర్గంలో మొట్ట మొదటి సారి 68వ యస్.జి.ఎఫ్. ఏ.పి. ఇంటర్ డిస్ట్రిక్ అండర్14 బాల , బాలికల బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ను గ్రీన్ ఫ్లాగ్ ఊపి బ్యాట్మెంటన్ క్రీడను ప్రారంభించిన దాసరిపల్లి జయచంద్ర రెడ్డి . జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీమతి దాసరిపల్లి కల్పన జయచంద్ర రెడ్డి . ఈ కార్యక్రమంలో దాసరిపల్లి జయచంద్ర రెడ్డి బ్యాట్ మెంటన్ ఆడి పిల్లలను ఉత్తేజపరచి తదనంతరం సమావేశంలో మాట్లాడుతూ పోటీలకు విచ్చేసిన క్రీడాకారులకు అన్ని రకాల వసతులను బస చేయడానికి , ఆహారం కు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడలు మన తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నందుకు చాలా గర్వంగా , ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ మన నియోజకవర్గంలో ఇలాంటి పోటీలు మరియు క్రీడలకు గత ప్రభుత్వాలు ముందడుగు వేయలేదని ఇలాంటి కార్యక్రమాలు జరిగితే నియోజకవర్గం లోని విద్యార్థులు ఆటలు , క్రీడల పట్ల మక్కువ పెంచుకొని వాళ్లు క్రీడల్లో రాణిస్తార అని గత ప్రభుత్వం భూ కబ్జాలు ఇసుక మాఫియాలు చేయటంలో ముందుందని ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నడూ ప్రోత్సహించలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తామని వచ్చే ఏడాది కల్లా మొలకలచెరువు లో ప్రభుత్వ మైదానం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు . .ఈ పోటీల్లో బాలుర టీం విన్నర్స్ కి రూ.100000 మరియు రన్నర్స్ కి రూ.50000 , బాలికల టీం విన్నర్స్ కి రూ.100000 మరియు రన్నర్స్ కి రూ.50000 తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం తరఫున బహుమతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి తో పాటు సతీమణి శ్రీమతి దాసరిపల్లి కల్పన జయచంద్ర రెడ్డి , ములకలచెరువు సిఐ రాజా రమేష్ , ఎస్సై గాయత్రి , తహసీల్దార్ ప్రదీప్ కుమార్ , ఎంపీడీవో హరినారాయణ , సెక్రటరీ వసంత , ఎలక్ట్రిక్ ఏడి , రాష్ట్ర టిడిపి బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు , మాజీ వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ కె.వి రమణ , మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్ , పాస్టర్ సీనా మునిస్వామి, సోమశేఖర్ జయరామిరెడ్డి , మాజీ ఎంపిటిసి మస్తాన్ రెడ్డి , రియాజ్ ఎమ్మెస్ రమణ , బి ఓబులేసు , ఆదినారాయణ , పాల రాము , తిమ్మరాయుడు, జంగా రాఘవరెడ్డి , ఆయుబ్, షఫీ , కాలేశా, తంబళ్లపల్లి మండల కన్వీనర్ రెడ్డప్ప రెడ్డి , విశ్వనాథ్ రెడ్డి , గంగాదేవి , గంగాధర్ నాగేశ్వర్ రెడ్డి , లోకనాథ్ రెడ్డి , వై రమేష్ , దుర్గా రెడ్డి శంకర్ రెడ్డి , మరియు అధికార సిబ్బంది, క్రీడా సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News