నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 09: మదనపల్లె పట్టణంలోని మంజునాథ్ కాలనీ లో మైనర్ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకళం రేపుతోంది. మంజునాథ కాలనీకి చెందిన గఫూర్, హసీన దంపతుల కుమార్తె మస్తానీ 16 సం" ను సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిచూడగా అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడాన్ని గుర్తించారు. ఇంట్లో చున్నితో ఉరి తీసినట్లు కనిపించడం, తలుపులు తెరిచి ఉండడం, గొంతుకు ఉరి వేసుకున్న మార్కులు లేక పోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. బాడీని మార్చురీకి తరలించారు. మస్తానీ తండ్రి హోటల్లో పని చేయడానికి వెళ్ళగా, తల్లి హసీనా గొర్రెలు కాయడానికి వెళ్ళింది. ఇంట్లో వంటరిగా ఉన్న మస్తానీ ఆత్మహత్య చేసుకుని చని పోయినట్లు క్రియేట్ చేసినట్లు సమాచారం. మస్తానీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా..? లేక ఇతర కారణాలతో కానీ ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది
Reporter
Namitha News