నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 3 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలోని భవిత కేంద్రం దివ్యాంగులకు సంక్షేమ నిలయంగా నిలిచినట్లు ఎంఈఓ త్యాగరాజు తెలిపారు. మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన భవిత కేంద్రంలో కేక్ కట్ చేసి పిల్లలకు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. దివ్యాంగుల తల్లిదండ్రులు తమ పిల్లల లోపాల పై బాధపడకుండా భవిత కేంద్రంలో చేర్చి శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగుల తల్లిదండ్రులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 నాగ సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు రేఖ,శ్రావణి, ఫిజియోథెరపీ సరళ, తంబళ్లపల్లె హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు, హరిజనవాడ హెచ్ఎం సాంబశివ, సీఆర్పీలు సుధాకర్, బాలకృష్ణ దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
Namitha News