నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయండి - డాక్టర్ ఎస్.కే.బాషాకు ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల సూచనలు మదనపల్లె : కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే.బాషాకు ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల సూచించారు.గురువారం విజయవాడలోని గాంధీ భవన్ నందు ఏపీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం సమావేశం జరిగింది.ఈ సమావేశానికి డాక్టర్ ఎస్.కే.బాషా హాజరయ్యారు.అదేవిధంగా శుక్రవారం వై.ఎస్ షర్మిల,ఏపీ కాంగ్రెస్ మైనార్టీ వ్యవహారాల ఇంచార్జ్ డెస్టాన్ రాజా,వైస్ ఇంచార్జి జావీద్ ముల్లా,మైనార్టీ విభాగం అధ్యక్షులు దాదాగాంధీలను గుర్రంకొండ మండల మాజీ అధ్యక్షుడు సమీరుద్దీనుతోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మదనపల్లి నియోజకవర్గంలో తాము చేపట్టిన కార్యక్రమాలను డాక్టర్ ఎస్.కే.బాషా షర్మిలకు వివరించగా ప్రత్యేకంగా ప్రశంసించారన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.కే.బాషా మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించాలని,మైనార్టీలను ఏకతాటిపై నడిపేందుకు చర్యలు చేపట్టాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.అంతర్గత విభేదాలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇబ్బందికరంగా మారిందని,కావున ఇక్కడ పరిస్థితులను చక్కబరచాలన్నారు.దీనిపై షర్మిల స్పందిస్తూ సిడబ్ల్యుసి సభ్యుడు మస్తాన్ వలికి మదనపల్లె నియోజకవర్గంలో పరిస్థితులను చక్కపెట్టాలని ఆదేశించారు.దీంతో వచ్చే నెల సెప్టెంబర్ 20వ తేదీపైన అన్నమయ్య జిల్లా మరియు మదనపల్లి నియోజకవర్గంలో మస్తాన్ వలి పర్యటిస్తారని డాక్టర్ ఎస్.కే బాషా తెలిపారు.రాష్ట్ర మైనార్టీ విభాగం సమావేశం చాలా అద్భుతంగా జరిగిందని,పార్టీ మైనార్టీ విభాగం బలోపేతానికి ప్రముఖులు అందించిన సూచనలు,సలహాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.త్వరలోనే మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Reporter
Namitha News