నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 9 : తంబళ్లపల్లె శ్రీ మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి సోషల్ వెల్ఫేర్ అన్నదాన ట్రస్ట్ కు రూ 5,13,572 ఆదాయం లభించినట్లు అన్నదాన కమిటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మల్లయ్య కొండ కనుగొండ మద్దిరెడ్డి భవన్ లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన కమిటీ వేలాది మంది భక్తులకు చేసిన అన్నదానం, భక్తుల ద్వారా వచ్చిన ఆదాయ, ఖర్చుల వివరాలపై అన్నదాన కమిటీ సభ్యుల సర్వసభ్య సమావేశం జరిగింది. అన్నదానం కార్యక్రమంలో భాగంగా భక్తులు నగదు, వస్తు రూపంలో విరాళాలు అందజేశారు. ఆ వచ్చిన విరాళాలపై సభ్యులు జమా,ఖర్చులు సభ్యులకు వివరించారు. భక్తులు చందాలు, కానుకలు ద్వారా అందజేసిన విరాళాలు రూ 18,18,694 లక్షలు రాగా ఆ శివరాత్రి పర్వదినాన అన్నదానానికి రూ 13,05,122 ఖర్చు చేశారు. అన్నదాన ఖర్చు పోను రూ 5,13,572 ఆదాయం లభించినట్లు వారు లేఖర్లకు తెలిపారు.
Reporter
Namitha News