Thursday, 16 April 2026 04:31:48 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ప్రీ స్కూల్ సైన్స్ ఎక్స్పో ద్వారా చిన్నారుల్లో విజ్ఞాన వికాసం - జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

అంగన్వాడీ సెంటర్ లకు గ్రీన్ బోర్డుల పంపిణీ

Date : 05 November 2024 08:11 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 5 : అంగన్వాడి చిన్నారుల్లో ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ సైన్స్ ఎక్స్ పో ప్రదర్శనల ద్వారా విజ్ఞానం, అభ్యసన నైపుణ్యం పెంపొందుతుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సూచించారు. మంగళవారం తంబాలపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రంలో ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలతో ఏర్పాటుచేసిన వైజ్ఞానిక పరదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 30 అంశాల ప్రదర్శన మరియు డెమో ప్రదర్శన ఇప్పించారు. విభిన్న మోడల్స్, బాడీ పార్ట్స్, నా కుటుంబం, హెల్పింగ్ పీపుల్, ఆకారాలు, రంగులు, జంతువులు, పువ్వులు, వాహనాలు, జర్మనేషన్ ప్రాసెస్, హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం నిర్వహణ తో పాటు వస్తువుల గురించి వాటి రంగులు వాటి ఉపయోగం పై పిల్లల నైపుణ్యాన్ని కలెక్టర్ పరిశీలించి ప్రశంసించారు. పిల్లలతో కలెక్టర్ వారితో మమేకమై అభిరుచులను వారి ముద్దు ముద్దు మాటలకు ముగ్ధుడయ్యారు. చిన్నారులకు టీచర్ ఒక వస్తువు గురించి చెప్పడం దాని రూపాన్ని బోర్డుపై రాసి అది గుర్తుపట్టుకునేలా బోధించాలన్నారు. కేంద్రాల్లో గోడకు వేలాడే ప్లాస్టిక్ బోర్డులు పిల్లల్లో జిజ్ఞాస, అభ్యసన నైపుణ్యం పెంచే ప్రయోగశాలుగా మార్చాలన్నారు. గత పర్యటనలో తంబళ్లపల్లె అంగన్వాడి కేంద్రాలలో బోర్డులు లేవని గమనించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కేంద్రాలకు గ్రీన్ బోర్డులు, డస్టర్ చాక్ పీస్ బాక్సులను అంగన్వాడీలకు అందజేశారు. సెంటర్లకు ఎక్కువగా నిరుపేద పిల్లలు వస్తారని వారిలో సమగ్ర అభివృద్ధి జరిగితే వారి భవిష్యత్తు పునాది బలంగా ఉంటుందన్నారు. పిల్లలను ఆటపాటల ద్వారా అందించే ఫ్రీ స్కూల్ విద్యను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. :తంబళ్లపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్టుకు ప్రశంసలు ః తంబళ్లపల్లె మండలం కన్నె మడుగు అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో ప్రదర్శన నిర్వహణపై సిడిపిఓ, టీచర్లను, ఆయాలను ప్రత్యేకంగా అభినందించి తంబళ్లపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్టు పనితీరుపై ప్రశంసించారు. అంగన్వాడీ కేంద్రాలలో 100% చిన్నారులు హాజరు ఉండేలా కృషి చేయాలని పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం లో లోపాలు లేకుండా చూడాలని అదే విధంగా మాత శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం సకాలంలో అందించాలని హెచ్చరించారు. తంబళ్లపల్లె ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడి సెంటర్ల పనితీరు చాలా బాగుందని జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులు తంబళ్లపల్లె ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకొని చిన్నారుల సంక్షేమం పై బాగా కష్టపడి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఇంచార్జ్ పీడి రమాదేవి, సిడిపిఓ నాగవేణి, ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి, తాసిల్దార్ హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ మహిళా నేత సిద్ధమ్మ, అంగన్వాడి సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు, పిల్లలు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :