నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి : క మూవీ విజయోత్సవ యాత్రలో భాగంగా హీరో "కిరణ్ అబ్బవరం"సొంత ఊరు రాయచోటికి వచ్చిన సందర్బంగా ఆయన్ని కలసి సన్మానం చేశారు. ఈ సందర్బంగా విఆర్డిఎస్ సురేంద్రారెడ్డి మాట్లాడుతు సినిమా ఇండస్ట్రిలో మంచి పేరు, ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు. హీరో కిరణ్ క సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలోనే వేసుకోవడమే కాకుండా ఇండస్ట్రిలో స్టార్ హీరోలకు దీటుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని తెలిపారు.కేవలం వారసులకు మాత్రమే పట్టం కట్టే పరిశ్రమలో తిరుగులేని పతాకంలా ఎగరడం అంటే మాములు విషియం కాదని అన్నమయ్య జిల్లాలోని యువత కిరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. గత ఐదు ఏళ్లుగా సినీ రంగంలో విజయవంతమైన నటుడిగా ఏదిగారని పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమంలో కిషోర్ కుమార్ రెడ్డి, జ్ఞానేంద్ర రెడ్డి,దేవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుద్యాల, శెట్టిపల్లె తదితర గ్రామాల ప్రజలు కిరణ్ ను కలసి సంబేపల్లె మండల వాసి గా సినిమా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుచుండడం అభినందనీయం, హర్షణీయం అంటూ శుభాకాంక్షలు.. ఆశీస్సులు అందచేశారు. మా ఊరు అబ్బాయని గర్వంగా చెప్పుకునేలా సినిమాలలో నటిస్తా. రాయచోటిలోని గౌతమ్ థియేటర్ లో జరిగిన విజయోత్సవ సభలో హీరో కిరణ్...* మా ఊరు అబ్బాయని గర్వంగా చెప్పుకునేలా సినిమాలలో నటిస్తానని హీరో కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. మంగళవారం రాయచోటిలోని గౌతమ్ థియేటర్ లో జరిగిన విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా హీరో కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ క సినిమా కు రోజు రోజుకూ మంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.ఈ సినిమా మంచి కుటుంభ కథా చిత్రమన్నారు.ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో నటించిన బృందంలోని సభ్యులలో అధికమంది క సినిమాలో నటించారన్నారు.ప్రేక్షకులు తన పట్ల చూపిస్తున్న ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మరువనన్నారు. తాను ఒక కొత్త కథ రాస్తున్నానని, వచ్చే ఏడాదిలో రాయచోటిలోనే షూటింగ్ ప్రారంభిస్తానన్నారు.మన రాయచోటి ప్రాంతంపై తనకు విపరీతమైన ప్రేమ,అభిమానమన్నారు.అవకాశం, వీలున్నప్పుడల్లా రాయచోటి ప్రాంతానికి వచ్చి వెల్లుతుంటానన్నారు.ఈ ప్రాంత యువత వివిధ రంగాలలో అభివృద్ధి చెందాలని కిరణ్ ఆకాంక్షించారు.
సంబేపల్లె మండలంలోనూ, రాయచోటి పట్టణంలోనూ హీరో కిరణ్ అబ్బవరం కు ఘన స్వాగతం పలికిన అభిమానులు, సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామం నరసారెడ్డిగారిపల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టిన హీరో కిరణ్.
Reporter
Namitha News