నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట - ఫిబ్రవరి 08 : బీసీ కార్పొరేషన్ ఋణాల దరఖాస్తు గడువు పెంపు చేసారని కనుక అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్న ఎంపీడీఓ గంగయ్య ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ , 2 నెలల్లో యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు తీసుకొంటామని తెలియచేసారు . రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను గడువులోగా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని తెలియచేసారు . లబ్దిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు రుణాల దరఖాస్తుల గడవును ఈ నెల 12 వ తేదీన వరకూ ప్రభుత్వం పొడిగించినట్లు తెలిపారు . 2024-25 ఆర్థిక సంవత్సరం మరో 2 నెలల్లో ముగినుందని, తక్షణమే అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులు కూడా కేటాయింపు కూడా చేసారని తెలిపిన ఎంపీడీఓ గంగయ్య .
Admin
Namitha News