Thursday, 16 April 2026 08:01:06 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

జిల్లా కేంద్రం ఏర్పాటుతో మారనున్న మదనపల్లె రూపురేఖలు

పారిశ్రామిక అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు మెరుగు - జనసేన పార్టీ జిల్లా నాయకులు రాయల్ గణి హర్షం

Date : 03 November 2025 09:51 PM Views : 235

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా కేంద్రం ఏర్పాటుతో మారనున్న మదనపల్లె రూపురేఖలు - పారిశ్రామిక అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు మెరుగు - జనసేన పార్టీ జిల్లా నాయకులు రాయల్ గణి హర్షం మదనపల్లె : త్వరలో జిల్లా కేంద్రం కానున్న నేపథ్యంలో మదనపల్లె రూపురేఖలు మారనున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు రాయల్ గణి పేర్కొన్నారు.సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లడుతూ గత వైసిపి నాయకుల స్వార్థం కోసం మదనపల్లెను జిల్లా కాకుండా చేశారన్నారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సుముఖతకు తెలుపడం శుభసూచకమన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ మదనపల్లె జిల్లా అంశాన్ని ప్రస్తావించి శభాష్ అనిపించుకున్నారన్నారు.అటు బెంగళూరు,ఇటు చైన్నై మహా నగరాలకు మదనపల్లి సమీపంలో ఉండడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి సానుకూల అంశమన్నారు.పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు.మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో కడప - రాయచోటి - బెంగళూరు రైల్వే వెనక్కి వెళ్లిపోయిందన్నారు.తిరిగి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కడప - మదనపల్లె - బెంగళూరు రైల్వే లైను నిర్మాణానికి సానుకూలంగా ఉందని,అదేవిధంగా ఒక విమానాశ్రయం నిర్మాణానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.కావున జిల్లా ఏర్పాటు అయితే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగడమే,ఇక్కడ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు.మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సహకరిస్తున్న సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర,చక్రి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :