నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 28 ః ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 100% అక్షరాస్యత సాధనే లక్ష్యంగా పనిచేయాలని వివో సభ్యులకు ఏపీఎం గంగాధర్ సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివో సభ్యులు, సంఘమిత్రలకు వయోజన విద్య పై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ త్యాగరాజు మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీలలో నిరక్ష్యరాసులను గుర్తించామని వారికి వివో సభ్యులు, సంఘమిత్రలు ప్రతిరోజు గంట పాటు చదువు చెప్పాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మండలములో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ థామస్ రాజా, ఈఓఆర్డి దిలీప్ కుమార్ నాయక్, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, మండల సమైక్య అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, మండలంలోని సీసీలు సంఘమిత్రలు, వివో లీడర్లు పాల్గొన్నారు.
Reporter
Namitha News