నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి నమిత న్యూస్ డిసెంబర్ 19:- రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకం పై అవగాహనా ర్యాలి ఉదయం 10:30 గంటలకు సంజీవ్ నగర్ కాలనీ చెక్పోస్ట్ శివాలయం వద్ద నుంచి మాసాపేట సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ను బరువుతో కాకుండా బాధ్యతతో దరించి సురక్షితంగా ప్రయాణించాలని వాహనదరులను కోరారు. ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ రెడ్డి,అర్బన్ సి ఐ చంద్ర శేఖర్ లు.అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు మేరకు రాయచోటి డివిజన్ డిఎస్పి కృష్ణ మోహన్ నేతృత్వంలో పట్టణంలో హెల్మెట్ వాడకం పై బైక్ ర్యాలి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ర్యాలీని అర్బన్ సి ఐ చంద్ర శేఖర్ జెండా ఉపి ప్రారంబించారు.స్థానిక శివాలయం నుండి ఎస్ యాన్ కాలని,నేతాజీ కూడలి,బస్టాండ్ సర్కిల్ ,నాలుగు రోడ్ల సర్కిల్ మీదగా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలిని కొనసాగించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోడ్డు ద్విచక్రవహనం నడిపే ప్రతి ఒక్కరు కుడా హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు.లక్షలాది రూపాయలు వ్యయం చేసి బైక్ లు కొన్నవారు హెల్మెట్ వాడక పోవడం చాలా బాధాకరం అన్నారు. మొబైల్ వాడకం పట్ల ఉండే ప్రాదాన్యత ,మన ప్రాణానికి ఎందుకు ఇవ్వలేక్ పోతున్నారని వారు ప్రశ్నించారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలలో హెల్మెట్ లేక పోవడం వల్లనే అధికంగా మృత్యువాత పడుతున్నారని విచారాన్ని వ్యక్తం చేశారు.హెల్మెట్ లేని ప్రయాణం సురక్షితం కాదని తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని లేని యెడల పొలిసు చర్యలు తప్పవని కూడా ఈ సందర్బంగా వారు హెచ్చరించారు.ఈ ర్యాలిలో లయన్స్ క్లబ్ అఫ్ రాయచోటి టౌన్ సభ్యులు,శ్రీ సాయి ఇంజేనేరింగ్ కలశాల యాజమాన్యం,విద్యార్థులు ప్రజలు,పొలిసు సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News