నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజల విశ్వాసం కోల్పోయిన కూటమి ప్రభుత్వం..నిబంధనల పేరుతో సూపర్ సిక్స్ పథకాలలో కోత... - మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ విమర్శలు... ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని మదనపల్లె నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ విమర్శించారు.బుధవారం పట్టణంలోని ఒకటో వార్డు నందు కౌన్సిలర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాబు షూరిటీ - మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నిస్సార్ అహ్మదుతోపాటు మాజీ ఎమ్మెల్సీ,వైకాపా రాష్ట్ర కార్యదర్శి నరేష్ కుమార్ రెడ్డి,ఏపీఎండీసీ మాజీ చైర్ పర్సన్ షమీం అస్లాం,మున్సిపల్ చైర్ పర్సన్ వి.మనూజా కిరణ్ రెడ్డి హాజరయ్యారు.ముందుగా వీరందరికీ కౌన్సిలర్ శ్రీనివాసులు పూలమాలలు,శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమాన్ని గాలికొదిలేసి,కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోందన్నారు.ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు.కూటమి నాయకులు దాడులు,దౌర్జన్యాలు అధికమైపోయాయని,శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయన్నారు.నిబంధనలపేరిట సూపర్ సిక్స్ పథకాలలో కోత విధిస్తోందని,ఇటీవల చాలామందికి దివ్యాంగులకు పింఛన్లను తొలగించారని విమర్శించారు.దీంతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందన్నారు.ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పాలనకు తూట్లు పొడుస్తూ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతోందని,మంగళవారం రాజంపేటకు విచ్చేసిన సందర్భంగా అనూహ్య రీతిలో ప్రజలు తరలివచ్చి జగనన్నపై తమ అభిమానాన్ని చాటుకున్నారన్నారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా 2029లో జగన్మోహన్ రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించారు.అదేవిధంగా రింగు రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని 101 టెంకాయలు కొట్టి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అనంత మునిశేఖర్,నర్రీ బాబాయ్,శంకర్ రెడ్డి,సిద్దేశ్వర్,సాంబశివ,శ్రీరాములు,నారాయణ స్వామి,జగన్,చలపతి,ఇడగొట్టి మల్లికార్జున,ముక్కుంట్ల జగదీష్,కొత్తపల్లె మహేష్ బాబు,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,శారదా రెడ్డి,వినూతా భాయి,నాగమణి,మంజుల తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News