నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 20 : తంబళ్లపల్లె మండలంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛ్ ఆంధ్ర, స్వచ్ఛభారత్ కార్యక్రమాల లో భాగంగా పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమాలలో భాగంగా మొక్కలు నాటి అనంతరం లే అవుట్ లలో పర్యటించి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పారిశుధ్యంతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వర్షాల కారణంగా దోమల నివారణకు అధికారులు ఫాగింగ్, క్లోరినేషన్, మురికి నీటి ప్రవాహాన్ని అరికట్టి మలాథియన్ పిచికారి చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో థామస్ రాజా, ఏఈఈ వినోద్ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏ ఈ ఓ సురేష్, పద్మావతి, ఐకెపి సీసీలు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News