Thursday, 16 April 2026 07:59:52 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్.రెడ్డీ సాహెబ్ నిర్విరామ కృషి -- కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Date : 19 July 2025 05:10 PM Views : 299

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్.రెడ్డీ సాహెబ్ నిర్విరామ కృషి -- కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు -- నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా పుట్టిన రోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్.రెడ్డి సాహెబ్ నిర్విరామ కృషి చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని దొంతి వీధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రెడ్డి సాహెబ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువా, గజమాలలతో ఆయనను ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనా కుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనే తన ఊపిరిగా భావించి పార్టీ అభ్యున్నతి కోసం ఎస్.రెడ్డి సాహెబ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ అధిష్టానం వద్ద తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. నిరంతరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎస్.రెడ్డి సాహెబ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ చిన్నతనం నుండి తనకి కాంగ్రెస్ పార్టీ అంటే అంతులేని అభిమానం అని, ఆ అభిమానమే తనను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేసిందన్నారు. దేశ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పటిష్టంగా తయారవుతోందన్నారు. ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసే 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని నెరవేరుద్దామని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా తనపై ఎంతో అభిమానంతో పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని, ఇదే అభిమానం మున్ముందు తనపై కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మీనా కుమారి, మహమ్మద్ షరీఫ్, ఖాదర్ బాషా, ముబారక్ ఖాన్, మహమ్మద్ రఫీ, ఈశ్వరమ్మ, శరత్ కుమార్ రెడ్డి, రవీంద్ర, మహబూబ్ పీర్, నాగరాజ, పాలేటి, మహమ్మద్ అలీ, బక్షు, ఖాసిం వలి, వసంతమ్మ, సోను, సయ్యద్, సాదిక్, సుహేల్, సాజిద్, యూనుస్, సాయి, చంద్ర, రాజు మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :