నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - ఆగస్ట్ 09: నిమ్మనపల్లి మండలం లో రెండ్రోజులు క్రితం బస్సుకింద పడి చిన్నారి మృతి చెందిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయవాణి పాఠశాల బస్సు డ్రైవరు నిర్లక్ష్యానికి నాలుగేళ్ల చిన్నారి దివాకర్ మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. పాఠశాల వ్యాన్ కు క్లీనర్ ను ఏర్పాటు చేయకపోవడమే ప్రధానం కారణంగా విద్యార్థి మృతి చెందడంతో బాధితుల ఫిర్యాదుపై పాఠశాల కరస్పాండెంట్ రఘుపతి నాయుడు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు నాయుడు, డ్రైవర్ గురుప్రసాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Admin
Namitha News