నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె క్రైమ్ : : నమిత న్యూస్: సెప్టెంబర్ 21: భార్య కాపురానికి రాలేదని ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సీఐ కథనం మేరకు.. మదనపల్లె మండలం, బొమ్మనచెరువు పంచాయితీ, బొగ్గిటివారిపల్లెకు చెందిన వెంకటరమణ(26) తన భార్య హేమలత కాపురానికి రాలేదని శనివారం అత్తగారి ఇంటికి వెళ్లి అత్త, మామలను నిలదీశాడు. భార్యతో పాటు అత్త, మామలు రామన్న, సిద్ధమ్మలు అల్లునిపై దాడి చేయడంతో మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని వెంటనే 108 వాహనములు చికిత్స కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Reporter
Namitha News